నటిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సినీ నిర్మాత!

Producer Harshavardhan: సినీ ఇండస్ట్రీలలో ఎప్పటి నుంచో కొన్ని సంఘటనలు బయట పడుతూనే ఉన్నాయి. వాటిలో నటీనటుల ప్రేమ వ్యవహారాలు చాలా వరకు బయటకు వచ్చాయి. కొందరు సినీ ప్రముఖులు హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తామని చెప్పి మోసం చేయడం.. స్టార్ హీరోయిన్ లుగా మారుస్తామని తమ వలలో వేసుకోవడం లాంటి వార్తలు చాలా విన్నాం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు.. తరుచుగా జరుగుతూనే ఉన్న ఘటనలే అని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం చేసుకుంటానని ఓ ప్రొడ్యూసర్ ఒక నటిని మోసం చేశాడు. అది ఎవరో కాదు ప్రొడ్యూసర్ హర్షవర్ధన్. తాజాగా ఈయన ప్రేమ వ్యవహారం బట్టబయలయ్యింది. ఒక కన్నడ నటిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.

ఆ కన్నడ నటి సీరియల్ లో ఎక్కువగా నటిస్తుంది. దాంతో హర్షవర్ధన్ తో ప్రేమలో పడింది. వారిరువురు కొంత కాలం ప్రేమాయణం బాగానే నడిపారు. కానీ కొంతకాలానికి మోసపోయానని తెలుసుకుంది. ఇక ఆ బాధితురాలు వివాహం చేసుకోమని పట్టుబట్టింది. దాంతో నిర్మాత హర్షవర్ధన్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇక ఆ నటి హర్షవర్ధన్ పై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు నిర్మాత హర్షవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన గురించి ఆ బాధితురాలు అధికారికంగా ఏమని స్పందిస్తుందో వేచి వేచిచూడాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *