నోట్ల రద్దు పై పవన్ కళ్యాణ్ స్పందనేంటి?

500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా మాట మార్చి మోసం చేస్తున్న బి.జె.పి. పై పవన్ కళ్యాణ్ గత సభలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు అనంతపురం లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలనే నినాదంతో జనం ముందుకు రానున్నారు జనసేనాని. గత సభలో తన ఘాటైన ప్రసంగంతో భారతీయ జనతా పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేసిన పవన్ రేపటి సభలో ఆ పార్టీ వైఖరి పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *