నెల్లూరు నగరంలో ఈ వారం విడుదలైన చిత్రాలు

నెల్లూరు నగరంలో ఈ వారం 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఎస్ 2 సినిమాస్ మరియు అర్చన థియేటర్ లో నిఖిల్, నందిత శ్వేత, హెబ్బా పటేల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విడుదల అయిన వాటిల్లో చెప్పుకోదగ్గ చిత్రం. ఆంగ్ల అనువాద చిత్రం ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్’  తెలుగులో లీలామహల్ లో 4 ఆటలు మరియు ఎస్ 2 సినిమాస్ లో ఒక ఆట ప్రదర్శితం కానుండగా మరో ఆంగ్ల అనువాద చిత్రం ‘ట్రైన్ టూ బుసాన్’ తెలుగులో ఎస్ 2 సినిమాస్ లో ఒక ఆట ప్రదర్శితం కానుంది. నిత్యామీనన్, క్రిష్ జె సత్తార్ ల మలయాళ అనువాదం చిత్రం ‘ఘటన’ సిరి మల్టీప్లెక్స్ లో విడుదల అయింది. ఈ చిత్రాల పూర్తి స్థాయి బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ను మరో రెండు రోజుల్లో అంచనా వేయవచ్చు.    

Add a Comment

Your email address will not be published. Required fields are marked *