అల్లు అర్జున్‌తో డీజే టిల్లు బ్యూటీ.. వైరల్‌ అవుతున్న వీడియో..!

మిస్ మంగళూరు కిరీటాన్ని గెలుచుకుని అందరి హృదయాలను దోచుకున్న బ్యూటీ నేహా శెట్టి. ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇటీవ‌లే వ‌చ్చిన డీజే టిల్లు సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది నేహాశెట్టి . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్దనే కాకుండా OTT ప్లాట్‌ఫామ్‌పై కూడా మంచి విజయం సృష్టించింది. అయికే నేహాశెట్టి ఇప్పుడు బంపర్ ఆఫర్‌ను దక్కించుకుంది.

పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వీరిద్దరూ కలిసి చేసిన కొత్త యాడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ యాడ్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ నోవాటెల్ హోటల్‌లో చిత్రీకరించారు.

చాలా ఇంప్రెసిప్ ఉన్న ఈ ప్రోమో చాలా మంది ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటూ..మంచి వ్యూస్ రాబడుతోంది. మ‌రోవైపు అల్లు అర్జున్ ఇటీవ‌లే పుష్ప..ది రైజ్ తో మంచి హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ నేషనల్ లెవ‌ల్‌లో పెద్ద స్టార్ అయ్యాడు. బన్నీ రేంజ్ కూడా అమాంతం పెరిగింది. దీన్ని ప‌లు కంపెనీలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆహా, ర్యాపిడో బైక్ కంపెనీలు త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకున్నాయి. ఇక సుకుమార్ డైరెక్ష‌న్‌లో ఈ మూవీకి రెండో పార్టుగా రాబోతున్న పుష్ప‌..ది రూల్‌తో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *