నెల్లూరు నగరంలో ఈ వారం విడుదల కానున్న చిత్రాలు ఇవే

నెల్లూరు నగరంలో ఈ వారం 5 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ఎస్ 2 సినిమాస్ మరియు అర్చన థియేటర్ లలో 11న విడుదల అవుతున్నది. అర్జున్ రాంఫాల్, ఫర్హాన్ అక్తర్, ప్రాచి దేశాయ్, పురబ్ కోహ్లీ, శ్రద్ధా కపూర్ ల హిందీ చిత్రం ‘రాక్ ఆన్ 2’ కూడా ఎస్ 2 సినిమాస్ లో విడుదల అయింది. సిరి మల్టీప్లెక్స్ లో మోహన్ లాల్, సత్యరాజ్, అమలా పాల్ ల మలయాళ డబ్బింగ్ చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’, రాజబీర్ సింగ్, దివ్య సింగ్ ల హిందీ చిత్రం ‘ఇష్క్ జనూన్’ విడుదల అయ్యాయి.  జీవా, హన్సిక నటించిన తమిళ అనువాద చిత్రం ‘పోకిరి రాజా’ 12వ తేదీన లీలామహల్ లో విడుదల కానుంది. పోయిన వారం నిరాశాజనకంగా ఉన్న నెల్లూరు బాక్స్  ఆఫీస్ లో  ఈ వారం ఎలాంటి  ఫలితాలు ఉంటాయో చూడాలి.
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *