నెల్లూరులో అలరించిన ఫ్యాషన్ షో

యువతీ యువకుల్లో దాగున్నసృజనాత్మకత వెలుగులోకి తీసుకొచ్చి మోడలింగ్ మరియు సినీ రంగాల్లోరాణించేందుకు వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలా ‘అనురాగ్ ఈవెంట్స్’ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం మద్రాసు బస్టాండ్ సమీపంలో గల ఓ హోటల్ లో శనివారం ఫ్యాషన్ షో నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని యువ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మన జిల్లా వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, ఇటువంటి పోటీల కారణంగా నగరానికి గ్లోబల్ ఎక్స్ పోజర్ పెరుగుతుందని తెలిపారు. నెల్లూరు యువతీ యువకులు మోడలింగ్ మరియు సినీ రంగాల్లో సైతం తమ ప్రతిభను చాటాలని అభిలషించారు. మరో అతిథి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో తెలుగు కథానాయికల కొరత ఉందని, ఇటువంటి పోటీలు ఆ కొరతను తీర్చేందుకు దోహదపడుతాయని తెలిపారు. ఈ పోటీల్లో హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, వాకింగ్, ఇంటలిజెన్స్ అంటూ నాలుగు రౌండ్లు జరిగాయి. ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసారు. నెల్లూరులో ప్రారంభం అయిన పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఫైనల్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తామని ఈవెంట్ నిర్వాహకులు ప్రవీణ్, నాగసాయి, భాను, ముజీర్, కిరణ్ కుమార్ రెడ్డి, రాక్ స్టార్ లక్కీ తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా బాబీ, శాంతి, కృష్ణ చైతన్య కళాశాల డైరెక్టర్ సుధ పాల్గొన్నారు.

  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *