విజయ్ దేవరకొండ – సమంత సినిమా షురూ..!

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

vijay devarakonda samanthas new movie pooja ceremony

విజయ్‌ దేవరకొండ 11వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇప్పటికే సమంత, విజయ్.. ‘మహానటి’లో కలిసి నటించి మెప్పించారు. మనసుని హత్తుకునే ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని, దీనికి ‘ఖుషి’ టైటిల్‌ పెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.  ఈ నెలలో కశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఆ తర్వాత విశాఖ, కేరళలోని అలెపీలో షూటింగ్ చేయనున్నారు. ఇందులో కశ్మీర్ యువతిగా సమంత నటించనున్నారని సమాచారం. అయితే… ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు.

కాగా విజయ్‌ ప్రస్తుతం.. ‘లైగర్‌’ ప్రమోషన్స్‌, ‘జనగణమన’ షూట్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ వర్క్‌లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్న విజయ్.. పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీతో కలిసిగతవారం యూరప్‌ టూర్‌కు వెళ్లారు. టూర్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను సైతం ఆయన తరచూ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే వెకేషన్‌ పూర్తి చేసుకొని బుధవారం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *