జెనీలియా మళ్ళీ వస్తోంది

బొమ్మరిల్లు హాసిని అదేనండి జెనీలియా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించనుంది. దక్షిణాదిలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన జెనీలియా ఆపై బాలీవుడ్‌లోనూ సత్తా చాటుకుంది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన జెనీలియా.. ఆపై సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇద్దరు బాబులకు తల్లైన జెన్నీ.. గ్లామర్‌గా కనిపిస్తోంది. దీంతో అమ్మడు రీ ఎంట్రీ ఖాయమైపోయింది.  ఈ నేపథ్యంలో 2011లో రిలీజ్ అయిన ఫోర్స్ సినిమాతో ఆకట్టుకున్న జెనీలియా లాంగ్ గ్యాప్ తరువాత ఆ సినిమాకు సీక్వల్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. కానీ తొలి భాగం చివర్లో జెనీలియా ఫోర్స్ పార్ట్ 1లో చనిపోతుందని.. అయితే ఫోర్స్ 2లో జెనిలియా రోల్ ఎలా ఉంటుంది. ఆమె పాత్రను ఎలా చూపెడతారు. దెయ్యంగా వస్తుందా అనే దానిపై చర్చ సాగుతోంది. కాగా సోనాక్షి సిన్హా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా (ఫోర్స్-2) నవంబర్ 18న రిలీజ్ కానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *