క్రీడాకారులు తమ రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
May 12, 2017
నెల్లూరు ఎ.సి. సుబ్బారెడ్డి స్టేడియం లో వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమానికి హాజరవుతున్న క్రీడాకారులకు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఏర్పాటు చేసిన దాతలను అభినందించారు. క్రీడాకారులు తమకు అందివస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.