అవి ఇంటర్నెట్ లో వెతికితే అరెస్ట్ అవుతారు… తస్మాత్ జాగ్రత్త…?

 కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే ఇంటర్నెట్ కు కూడా ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా మనం మంచి కావాలనుకుంటే మంచి విషయాలను చెడు కావాలనుకుంటే చెడ్డ విషయాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. కానీ నిబంధనలను అతిక్రమించి ఇంటర్నెట్ లో వెతికారంటే మాత్రం జైలుకు వెళ్లడం ఖాయం. ఢిల్లీలోని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ఎవైతే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తారో వారిని అదుపులోకి తీసుకుంటుంది.

తాజాగా హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన వ్యక్తి, కాచిగూడకు చెందిన ప్రశాంత్ కుమార్ అనే మరో వ్యక్తి అశ్లీల వెబ్ సైట్లలోకి వెళ్లి ఫోటోలను, వీడియోలను డౌన్ లోడ్ చేసి ఇతర సైట్లలో అప్ లోడ్ చేశారు. క్రైమ్‌ బ్యూరో ఆ సమాచారాన్ని సీఐడీ అధికారులకు తెలియజేసింది. సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఐపీ అడ్రస్ ల ఆధారంగా నిన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీపై నిషేధం ఉంది. అందువల్ల ఇంటర్నెట్ వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *