మార్గమధ్యంలో బస్సు ఆపిన డ్రైవర్.. అంతలోనే ఆమె ఏం చేసిందంటే?

Bus: సినిమాలో మనం ఎన్నో బస్సు యాక్సిడెంట్ లను చూస్తూ ఉంటాం. అందులో ప్రయాణికులను కాపాడే క్రమంలో వింత వింత ట్విస్ట్లు జరుగుతూ ఉంటాయి. అదే తరుణంలో రియల్ లైఫ్ లో కూడా ఓ అద్భుతం జరిగింది. అసలు ఏమి జరిగిందంటే.. మహారాష్ట్ర పూణే లో బస్సులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ బస్సులు నడుపుతూ ఉండగా.. అతనికి పిట్స్ వచ్చింది.

Bus
Bus

వెంటనే ఆ బస్సు కు బ్రేక్ వేశాడు. ప్రయాణికులందరిని ప్రమాదం నుంచి తప్పించాడు. కానీ అక్కడ మరో టెన్షన్.. బస్సు ఆగిన చోటా స్థానికులు ఎవరు ఉండరు. అది దోపిడీ దొంగల రాజ్యం. ఒంటరిగా ఉన్న వాహనాలను వారు టార్గెట్ చేస్తారు. అలాంటి చోట బస్సు ఆగడం, అందులోను డ్రైవర్ కు పిట్స్ రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

అదే బస్సులో యోగితా సతావ్ అరే అనే 42 సంవత్సరాల మహిళకు పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా భయంతో ఏడవడం మొదలు పెట్టారు. వాళ్లకి ధైర్యం చెప్పిన ఆమె వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. యోగిత కు ఇది వరకు కార్ డ్రైవింగ్ వచ్చు.. అదేవిధంగా బస్సును నడపాలి అని అనుకుంది. వెంటనే డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సు స్టార్ట్ చేసింది. మధ్య మధ్యలో దిగాలి అనుకున్న ప్రయాణికులను దింపేసింది.

ఆ డ్రైవర్ ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది. ఇక ప్రయాణికులు, డాక్టర్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో నెటిజన్ల ను తెగ ఆకట్టుకుంటుంది. ‘అలీ షైఖ్ ‘ అనే ఖాతాలో ఈ వీడియోని పంచుకున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *