పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. వైరల్ వీడియో..!

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చాలా వీడియో వైరల్ అవుతున్నాయి. రోజుకు కొన్ని వందల సంఖ్యలో వీడియోలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. క్రైం ఉండే వాటిలో చాలా వీడియోలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వీడియోనే ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు కూడా దీన్ని ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి… ఏం జరిగింది.

woman beat policeman with slippers at Charabagh Railway Station midnight ruckus
woman beat policeman with slippers at Charabagh Railway Station midnight ruckus

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో ఓ మహిళ పోలీసును చెప్పుతో చెంప మీద కొట్టింది. ఈ ఘటన చార్‌బాగ్ రైల్వే స్టేషన్ లో జరిగింది. సంబంధిత వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ప్లాట్‌ఫాం పై కొందరికి, పోలీసులకు గొడవ ప్రారంభం అయ్యింది. వస్తువులకు సంబంధించి స్టార్ట్ అయిన ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరకు పోలీసు అక్కడ ఉన్న వారిపై లాఠీ చేసుకున్నారు. ఈ గొడవ జరిగేటప్పుడు పక్కన ఉన్న ఆ మహిళ పోలీసును చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడీయో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ఈ గొడవ జరిగేటప్పుడు పోలీసులు మద్యం మత్తులో ఉన్నాడని వారు చెప్పారు. వారిపై దాడి కి దిగితే వారు కూడా కొట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మహిళ కూడా కలబడి పోలీసును చెప్పుతో కొట్టినట్లు చెప్పారు. అయితే సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. కానీ వీడియో మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *