మహేశ్‌బాబు కోసం క‌థ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  మ‌హేశ్ బాబు కెరీర్‌లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్‌గా నిలిచింది. టైం కలిసొస్తే మ‌రోసారి తాను మ‌హేశ్ తో సినిమా చేస్తాన‌ని గ‌తంలోనే అనిల్ రావిపూడి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర మ‌హేశ్ కోసం క‌థ ఉంద‌ని చెప్తూ వ‌స్తున్న అనిల్‌..తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దీని గురించి మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు.

Will team up with Mahesh Babu for a film whenever time permits: Anil Ravipudi

‘మహేశ్‌సర్‌ మిషన్‌ త్వరలోనే మొదలు పెడతా. ఆయన ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులన్నీ పూర్తయిన వెంటనే మా మూవీ మొదలు పెడతాం. నేను సిద్ధంగా ఉంటా’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు. అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్‌తో మరో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా ఎఫ్ 3 చేస్తున్నాడు. త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ ప్రాజెక్టు వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న ఎన్‌బీకే 107 సినిమా పూర్త‌యిన త‌ర్వాత బాల‌కృష్ణ‌-అనిల్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు టాక్‌.

Will team up with Mahesh Babu for a film whenever time permits: Anil Ravipudi

ఇక మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తర్వాత మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *