పరగడుపున నీళ్లు ఎందుకు తాగాలి.?
జీవరాసి మొత్తం ఆధారపడే వనరు నీరు. అన్నం తినకుండా ఒక్కరోజైనా ఉండవచ్చు కానీ.. నీరు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. ఉదయం లేచిన దగ్గర్నుండి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ నీటితో పని. నిజానికి.. మన శరీరానికి మంచి నీళ్లు చేసేంత మంచి.. ఇంకేవీ చేయవు. రోజూ తగినంత మంచినీళ్లు తాగితే చాలు… సగం రోగాలు తగ్గుతాయి అంటారు డాక్టర్లు. అయితే.. మంచి నీళ్లు ఎప్పుడు తాగాలో కూడా తెలుసుకోవాలి. ఏ సమయంలో తాగితే మంచిదో ఆ సమయంలోనే మంచినీళ్లను తాగితే.. ఇంకా మరిన్ని ఫలితాలు లభిస్తాయి.
పరగడుపున నీళ్లు తగాడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి పోతాయి. వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఎందుకంటే.. ఉదయం లేవగానే.. కడుపు ఖాళీగా ఉంటుంది. ఒక గ్లాస్ కానీ.. రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగగానే.. మంచి నీళ్లు.. లోపల ఉన్న చెత్తా చెదారాన్ని అంతా బయటికి పంపిస్తుంది. విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. గడ్డ కట్టుకుపోయిన మలం మొత్తం.. మంచి నీళ్లు తాగగానే.. విరేచనం సాఫీ అయి.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
నిత్యం లేవగానే కాసిన్ని మంచినీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు మలబద్ధకం సమస్య అస్సలు రాదు. ఉదయం లేవగానే ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఇక్కడ కొలత అంటూ ఏమీ ఉండదు. తమకు తోచినన్ని మంచినీళ్లను తాగొచ్చు. పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఉదయం మంచినీళ్లు తాగే వాళ్లు.. కాస్త గోరు వెచ్చని నీటిని తాగండి. అవి ఇంకా మంచిది. గోరు వెచ్చని నీటిని తాగితే.. బరువు తగ్గుతారు. పేగులు, ఇతర అవయవాలన్నీ శుభ్రం అవుతాయి.