రోడ్డుమీద కుప్పకూలిన వందలాది పక్షులు.. ఏం జరిగింది?

ఇటీవల సెల్ ఫోన్ టవర్లు, చెట్ల నరికివేత వంటి కారణాల వల్ల పక్షుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఇదివరకు పెద్ద సంఖ్యలో ఉండే పక్షులు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య తక్కువే ఉండడం ఆందోళన కలిగించే అంశమే.  పెరుగుతున్న కాలుష్యం, కాంక్రీటు భవనాల వల్ల పక్షుల మనుగడ కష్టంగా మారింది. ఓ చోట వందల కొద్ది పక్షులు కుప్పకూలాయి. రోడ్డుపై గుంపులు గుంపులుగా పడిపోయాయి. ఒకే రోడ్డు మీద అన్న పక్షులు ఒక్క సారిగా కుప్పకూలం సామాజికి మాద్యమాల్లో వైరల్గా మారింది.  దీ దృశ్యాన్ని చూసిన  నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. ఇంతకీ పక్షులు అన్ని అలా ఒక్కసారిగా రాలిపోవడం వెనుక కారణం ఏంటి?

Why did birds fall from sky in Mexico
Why did birds fall from sky in Mexico
మెక్సికోలో వందలాది పక్షులు రోడ్డు మీద పడిపోయాయి. గుంపులు గుంపులుగా కిందపడుతూ చనిపోయాయి. ఈ సంఘటన ఈనెల 7న జరిగింది. అయితే ఇందుకు విషవాయువులే కారణమని పక్షి ప్రేమికులు అంటున్నారు. విష వాయువుల వల్లే పక్షులు కుప్పలు కుప్పలుగా పడిపోయాయని ఆవేదన చెందుతున్నారు.  వాటిలో చాలా అరుదైన పక్షి జాతులు కూడా అన్నాయని అంటున్నారు. పక్షులను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత రెండూ మన మీదే ఉన్నాయని చెప్తున్నారు. వందలాది పక్షులు ఇలా చనిపోవడంతో పక్షి ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై కుప్పలుగా రాలిపోయిన పక్షుల దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. సేవ్ బర్డ్స్ పేరిట ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *