ఆడదాన్ని కాపాడలేన్నప్పుడు ఉంటే ఎంత..లేకపోతే ఎంతా? : వంగలపూడి అనిత

ఆడబిడ్డలకు భయపడుతున్న ముఖ్యమంత్రి, తన తండ్రినే అవమానించుకుంటున్నాడుని, మహిళలపై 1000కి దారుణాలు జరిగితే, వాటికి సమాధానంచెప్పలేకే జగన్ రెడ్డి భజనబృందం ఆడవాళ్లపై ప్రతాపం చూపుతోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.  మీసాలు తిప్పి, తొడలుకొట్టి, సినిమాడైలాగులు చెప్పి, జబ్బలుచరిచిన వారంతా ఆడవాళ్లపై దాడులుచేస్తున్నారంటే వారు ఎలాంటి మగాళ్లో అర్థమవుతోందని మండిపడ్డారు. ఆడవారిని కాపాడలేని సీఎం పదవిలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ప్రశ్నించారు. నెల్లూరులో టీడీపీ మహిళా నేత రేవతిపై, ఆమె భర్తపై పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ గూండాలు దాడిచేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

‘‘సోషల్ మీడియాపోస్టులకు ఉన్నవిలువ, ఆడబిడ్డల తాళిబొట్లకు లేదా?  వైసీపీప్రభుత్వం ఆడదానికి భయపడుతోంది, కాబట్టే పోలీసుల సాయంతో ఆడవాళ్లపై దాడిచేస్తోంది. నిండుగర్భిణి అయిన పనబాక భూలక్ష్మి తెలుగుదేశం పార్టీ తరుపున గట్టిగా మాట్లాడుతుందని ఆమెని బెదిరిస్తారా? భయపెట్టి, కేసులతో తెలుగుమహిళల్ని అడ్డుకోలేరని గుర్తుంచుకోండి.  ఆడవాళ్ల తాళిబొట్లను తెంచేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారముందని తాళిబొట్లతో ఆడుకుంటారా? మీరుచేసే వెధవపనులపై మేం మాట్లాడకూడదా?

గతంలో రౌడీషీటర్ గా ఉన్న వ్యక్తిని జగన్ రెడ్డి ఎమ్మెల్సీని చేస్తే, అతనేమో సొంతడ్రైవర్ ని చంపేసి, దర్జాగా తిరుగుతున్నాడు. ఎమ్మెల్సీ అయితే మనిషిని చంపేస్తాడా? దళితుల్ని చంపినా వారేం ఏం చేయలేరన్నదే మీ ఉద్దేశమా? వైసీపీఎమ్మెల్సీ తనడ్రైవర్ ని చచ్చిపోయేలా కొట్టడం పోలీసులకు సామాన్యవిషయమా? సుబ్రహ్మణ్యం భార్యగట్టిగా మాట్లాడితేనే పోలీసులు హత్యకేసు నమోదుచేస్తారా?  దళితయవకుల్ని కొట్టిచంపినా,  శిరోముండనాలు చేయించినా సీఐడీవారికి కనిపించదు. కానీ మాజీమంత్రులు, సొంతపార్టీఎంపీలను  మాత్రం ఎక్కడున్నా ఠక్కున పట్టుకొస్తారు.’’ అని ధ్వజమెత్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *