ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేము : పవన్ కళ్యాణ్

తాము ఎవరి పల్లకీలు మోసేందుకు సిద్ధంగా లేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అంటే ఎందుకు వైసీపీ భయపడుతోందని ప్రశ్నించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. అనంతంరం మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి అండగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018లో విద్యుత్ ఛార్జీల పెంపును జగన్ వ్యతిరేకించారన్నారు. అన్నంపెట్టే రైతులకు కులం చూడకూడదని వ్యాఖ్యానించారు. కులంలేని రైతులకు అండగా నిలబడాలన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో రూ.5 లక్షలకు లోపు అప్పులున్నవారు ఉన్నారని వివరించారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నాయన్నారు. 2024లో మేము వస్తాం..మీ బిడ్డలు బాగుండాలి కదా అని ప్రశ్నించారు. మనసుండి కదిలించగలిగే డబ్బులు వస్తాయన్నారు. వైసీపీ నేతల అరాచకం, దోపిడీ వల్ల రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాని ప్రభుత్వం గురించి మీరు తపన పడాల్సిన అవసరం లేదన్నారు.

అసలు వైసీపీకి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. ఇంత మంది ఎంపీలుండి విశాఖ ఉక్కుపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడటానికే  సిద్ధపడే మాట్లాడుతున్నానని ఉద్ఘాటించారు. ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేమని, ప్రజలను పల్లకీలు ఎక్కించేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కూర్చుని పేకాట క్లబ్బులు నిర్వహిస్తే ఎవరూ భయపడరని, మంచి పరిపాలన చేసే వారిని చూసి భయపడతారన్నారు. మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తెచ్చారన్నారు. ఐఎఏఎస్ అధికారులు మోకాళ్ల మీద కూర్చుంటే పాలన సరిగా లేదనే అర్థమని పేర్కొన్నారు. నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *