నువ్వు తీసుకున్న బీఫారంలో ఎవరిపేరుందిర కుక్కా.? : బుద్ధా వెంకన్న

టీవీల్లో మంత్రి కొడాలి నానిని చూసి బూచోడంటూ చిన్న పిల్లలు భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ప్రారంభం ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలు తొలగించి ఆ ప్లేస్ లో కొడాలి నాని ప్రకటనలివ్వాలని చురకలు అంటించారు. ప్రజలు, వైసీపీ శ్రేణులు కొడాలి నానిని చీడపురుగులా చూస్తున్నారని పేర్కొన్నారు. నువ్వు తీసుకున్న బీఫారంలో ఎవరిపేరుందిర కుక్కా.?  అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 420 లాంటి వైసీపీలో కొడాలి నాని ఓ 840 అని విమర్శించారు. వైసీపీ పుట్టుకే 420 ల నుంచి జరిగిందన్న కొడాలి నాని మరిచారా అని ప్రశ్నించారు.

పదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ జగన్ ను కొడాలి నాని పరోక్ష హెచ్చరికలు పంపారని అన్నారు. జగన్ లా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనం దోచుకునే బుద్ధి ఎన్టీఆర్ పిల్లలకు లేదని స్పష్టం చేశారు. హరికృష్ణ ఇమేజ్ ని డామేజ్ చేసిన వెన్నుపోటుదారుడు కొడాలి నాని అని మండిపడ్డారు. వివేకాను జగనే హత్య చేయించారని వాళ్ల కుటుంబం భావిస్తోందన్నారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని నందమూరి కుటుంబ సభ్యులెవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయారని నందమూరి కుటుంబం ఎవరైనా చెప్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.

చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగిందని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ చుట్టూ ఉన్నవారు టీడీపీని నాశనం చేయాలని చూశారని.. వేరే వారి చేతుల్లోకి పార్టీ వెళ్లకుండా చంద్రబాబు కాపాడారన్నారు. అది వెన్నుపోటు కాదు, పార్టీని పరిరక్షించారన్నారు. వెన్నుపోటు అంటే అంటే జగన్‌కే బాగా తెలుసని.. తండ్రి బెదిదిరించి మరీ బాబాయ్ వివేకాను వెన్నుపోటు పొడిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *