రాగులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Health Benefits: రాగి వార్షిక ధాన్యపు పంట. దీన్ని ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా వంటి మెట్ట ప్రాంతాల్లో పండిస్తారు. ఇక దీనికి ఇథియోపియా పుట్టినిల్లు లాంటిది. అక్కడ ఎత్తు ప్రదేశాలో ఈ పంట బాగా పండుతుంది. ఇలాంటి రాగి వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Benefits
Health Benefits

బరువు తగ్గడానికి: రాగుల్లో అధికంగా ఉండే అమినోయాసిడ్ ట్రిప్టోఫాన్ అమినో ఆమ్లంలు ఇవి ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి రాగులు మన శరీరానికి బాగా సహాయపడుతాయి.

ఎముకల ఆరోగ్యం కోసం: రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఇది మన శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. అంతే కాకుండా పిల్లలు సక్రమ ఎదుగుదలకు రాగి బాగా సహాయపడుతుంది.

అనీమియా: రాగుల్లో పుష్కలంగా ఉండే న్యాచురల్ ఐరన్ అనీమియాను నివారించుడంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఈ రాగులు ఎంతో మేలు చేస్తాయి.

మధుమేహగ్రస్తులకు: మధుమేహానికి రాగులతో కలిపి చేసిన ఆహార పదార్థాలు అనగా గంజి, పాలల్లో కలిపిన రాగుల మధుమేహానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను తగ్గించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది.

వయస్సును తగ్గిస్తుంది: రాగుల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇవి వయస్సును తక్కువగా కనబడేలా చేస్తాయి. కాబట్టి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి: రాగుల్లో ఉండే విలువైన పోషకాలు కాలేయ వ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడంలో తమ వంతు కృషిని చేస్తాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *