ఆ పోస్టులు డిలీట్ చేయాలంటూ విశ్వక్ సేన్ రిక్వెస్ట్..!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలె ఆయన నటించిన సినిమా ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ప్రమోషన్స్‌ కోసం చేసిన ప్రాంక్‌ వీడియో నెట్టింట ఎంతటి దుమారాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు ముందే బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. 33 ఏళ్ల వ్యక్తి పెళ్లి కోసం పడే పాట్లను చూపించిన ఈ కుటుంబకథా చిత్రంలో విశ్వక్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అయితే థియేటర్స్‌లో ఉండగానే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై ఇప్పటికే పలు వార్తలు దర్శనమిస్తున్నాయి.

Vishwak Sen Requests Audience About AVAK OTT Release Posts

దీంతో మ‌రోసారి హీరో విశ్వ‌క్ సేన్ రంగంలోకి దిగారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్పిన విశ్వ‌క్ సేన్‌.. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై కూడా స్పందించారు. మేక‌ర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఒక‌వేళ అలాంటి నిర్ణ‌యం తీసుకుంటే తామే అధికారికంగా స‌ద‌రు విష‌యాన్ని చెబుతామ‌ని అన్నారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన వార్త‌ల‌ను ద‌య‌చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌కండ‌ని.. చేసినా వాటిని డిలీట్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

https://www.instagram.com/p/CdTIjFgpZjm/?utm_source=ig_embed&ig_rid=c1375225-1b5c-4f1a-9bc4-a7a252c8d998

‘సోషల్‌మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై పోస్టులు పెట్టే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మిస్‌ కాకండి. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్‌ చేసేయండి. రూమర్స్‌ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్‌ వివరించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *