సమంత- విజయ్ దేవరకొండ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధానపాత్రలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతుంది. ఈనెల 21నే ఈ సినిమాను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ కానుంది. ఆ తర్వాత ఇదే నెల 23 నుంచే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

vijay devarakonda samantha movie update

ఇక ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ అయిన ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ సినిమా వస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ సినిమాలానే సూపర్ హిట్ లవ్ స్టోరీగా ఈ మూవీ కథ ఉంటుందేమో చూడాలి.

vijay devarakonda samantha movie update

ఇక ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ‘మజిలీ’ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, విజయ్‌ ఇందులో హీరోగా చేయడంతో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌`చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు విజయ్‌. ఇక సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె `శాకుంతలం`, `యశోద`, డ్రీమ్‌ వరియర్స్ చిత్రం, అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌`తోపాటు ఓ అంతర్జాతీయ సినిమా చేస్తుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *