సమంత బ్రతికుండటానికి కారణం ఆ ఇద్దరేనట!

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆపై ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం విషయానికి వస్తే.. ఏకంగా తన అభిమానులకు గ్లామర్ విందునే వడ్డీస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక అక్కినేని వారసుడు చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. అలా వీరి వివాహ బందాన్ని కొంతకాలం పాటు బాగానే రాణించినప్పటికీ.. ఇటీవలే వారిద్దరి భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా ద్వారా వెల్లడించారు.

ఇక వీరిద్దరి బ్రేకప్ విషయాన్ని తమ అభిమానుల నుంచి సెలబ్రిటీలు సైతం ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక చైతుతో విడాకులు అనంతరం సామ్ తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉంటూ.. ఎప్పటికప్పుడు తన పోస్టులను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా స్విజర్లాండ్ ట్రిప్ లో ఉంది సమంత.

సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా లో ఓ ఫోటో ని పంచుకుంటూ ‘వీరిద్దరి వల్లే ఇంకా బ్రతికి ఉన్నాను’ అని ఇన్స్టా గ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసింది. అంతేకాకుండా ఆ స్టోరీకి #skiingisbelieving అనే హ్యాస్ టాగ్ ను కూడా జత చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *