ముసలితో పరాచకాలాడిన వ్యక్తి.. పాపం చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా మనుషులు ముసలి పేరు వినడానికి గాని చూడనికి కానీ అసలు ఇష్టపడరు. అది గగ్గుర్లు పొడిచె చర్మంతో పెద్ద పెద్ద పళ్ళతో ఉంటుంది. కాబట్టి దాని దగ్గరికి వెళ్లడానికి మనుషులు ఎవరూ అంతగా ఆసక్తి చూపరు. కానీ ఓ వ్యక్తి మాత్రం దానితో పరాచకాలు ఆడటానికి ప్రయత్నించి ఆ ముసలికి అడ్డంగా బుక్కయ్యాడు.

Viral
Viral

అడవి దగ్గర ఉన్న చెరువు గట్టు దగ్గర దాదాపు ఏడు అడుగుల ముసలి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పటికే అది ఆహారం దొరకక ఆకలి కడుపుతో ఉందనుకుంటా.. దాని చుట్టూ దోమలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈ ముసలి చాలా చిరాకుగా ఉంది. అలాంటి ముసలి దగ్గరకు ఓ టూరిస్టు వచ్చి దానితో సరసాలు ఆడబోయాడు.

ముసలి దగ్గరికి వెళ్లి దాని తలను చేతితో ముట్టకుందాం అని అనుకున్నాడు. కానీ ముసలి అతడిని చిన్నగా భయపెట్టింది. ఈ అల్లరి వ్యక్తి.. అయినా వదలకుండా మరోసారి ముట్టుకోవడానికి ప్రయత్నం చేయగా.. ఆ ముసలి గురిచూసి అతని చేతిని నోట్లోకి లాక్కుంది. దాంతో ఆ వ్యక్తి లబోదిబో అన్నాడు.

ఆ చేతిని ఎలాగైనా వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇక ఆ వ్యక్తి ముసలి వీపు పైకి ఎక్కి దాన్ని కదల నివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసాడు. దాంతో ముసలి అతని చేతిని వదిలేసింది. ఆ వ్యక్తికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నంత పని అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *