గ్రేట్ బామ్మ.. దొంగకు చుక్కలు చూపించేశారు..!

షాపింగ్ మాల్ లలో నిఘా నేత్రాలు ఉన్నాయని తెలిసినా కూడా కొందరు ప్రబుద్ధులు చోరీలకు యత్నిస్తున్నారు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కి… పట్టుబడుతున్నారు. ఓ వ్యక్తి కూడా అచ్చం ఇలాగే పట్టుబడ్డాడు. అయితే మాల్ సిబ్బంది, లేక పోలీసులకు లకు అని అనుకుంటే పొరపాటే.  ఆ దొంగ పట్టుబడింది  ఓ 73 ఏళ్ల బామ్మకు.

Video Of 73 Year Old Grand Mother Stops Shoplifter At Walmart Store Viral On Social Media
Video Of 73 Year Old Grand Mother Stops Shoplifter At Walmart Store Viral On Social Media

అందరిలాగే ఆ యువకుడు కూడా మాల్ లోపలికి వెళ్లాడు. కార్ట్ తీసుకొని… కొన్ని వస్తువులను సేకరించాడు. నచ్చిన పస్తువులను తీసుకొని కిందకు వచ్చాడు. బిల్లు చెల్లించకుండా పరారవ్వాలని భావించాడు. కానీ ఆ బామ్మ మాత్రం ఆతడి ఆట కట్టించారు. ఈ సంఘటన కొలంబియాలోని క్యాంప్ బెల్ లోని ఓ సూపర్ మార్కెట్ లో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.

సూపర్ మార్కెట్ లోకి మంకీ క్యాప్ తో చొరబడ్డ ఆ వ్యక్తి… షాపింగ్ చేశాడు. తనకు కావాల్సిన వస్తువులను కార్డులో ఉంచి.. ఇంక చాలు అన్నాక కిందకి వచ్చాడు. ఆపై బిల్లు చెల్లించకుండా వెళ్లబోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది బిల్ గురించి అడిగితే.. పే చేశానని చెప్తూ.. పరారవ్వడానికి యత్నించాడు. ఈ విషయాన్నంతా ఓ 73 ఏళ్ల బామ్మ గ్రహించారు. వెంటనే తన కార్డు సాయంతో అతడిని ఆపేశారు. కార్టును బయటకు తీసుకెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇంకేం సిబ్బంది వచ్చి… ఆ తదుపరి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. బామ్మ చొరవను కొనియాడుతున్నారు. కాగా గ్రేట్ బామ్మ అంటూ… నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో మందికి ఈ బామ్మ ఆదర్శం అని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *