ఆ గ్రామంలో వెరైటీ న్యూ ఇయర్ వేడుకలు.. చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
సాధారణంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలంటే చాలామంది వివిధ రకాలుగా ప్లాన్ చేసుకొని కేక్ కట్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలోనే చాలామంది విభిన్న రీతులలో కేక్స్ డిజైన్ చేయించి కట్ చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా అష్టాచెమ్మా కేక్ చూశారా.. అదేంటి అష్టాచమ్మా కేక్ అని ఆశ్చర్యపోతున్నారా… అవునండి నూతన సంవత్సరం కానుకగా అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామంలో అష్టా చమ్మా ఆట పై మక్కువతో కొంతమంది యువత ప్రత్యేకంగా నూతన సంవత్సరానికి ఈ విధమైనటువంటి కేక్ తయారు చేయించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
అనంతపురం జిల్లా, రెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ వీధిలో ఉన్నటువంటి యువత అష్టా చమ్మా ఆట పై ఉన్న మక్కువతో అష్టాచెమ్మ కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ కేక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరు పూర్తిగా సెల్ ఫోన్ కి బానిస అవుతున్నారు. కానీ ఈ గ్రామంలోని కొందరు యువత మాత్రం సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కనపెట్టి సాయంత్రం అందరూ కలిసి ఎంతో సరదాగా అష్టా చమ్మా ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇలా అష్టా చమ్మా (బారాకట్ట)ఆడుతూ శారీరక, మానసిక ఉల్లాసం పొందుతున్నామని వీరు తెలిపారు. అయితే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయాలని భావించిన వీరు అందరిలాగా కేక్ కట్ చేస్తే ప్రత్యేకత ఉండదని కాస్త భిన్నంగా ఆలోచించి వారికి ఎంతో ఇష్టమైన అష్టాచమ్మా కేక్ తయారు చేయించి నూతన సంవత్సరానికి ఆ కేక్ కట్ చేస్తూ స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఈ ఆటలో సీనియర్ లైన కొండారెడ్డి, ముత్యాలు, శ్యామల, ప్రేమ శైలజ అనే కొంతమంది సమక్షంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.