వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ సంచలన వ్యాఖ్యలు…

కృష్ణా జిల్లా చిన్న గొన్నూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. రంగా కీర్తి, ఆశయ సాధనే తన లక్ష్యమన్న రాధా… పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. అనంతరం ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఏదో చేద్దామని రెక్కీ నిర్వహించారని… నేను దానికి భయపడనని అన్నారు. వారు ఎవ్వరో త్వరలో తెలుస్తుందన్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. ఎవ్వరు ఏ వెదవ వేషాలు వేద్దామని చూసిన అది జరగదన్నారు. తన అభిమానులు కూడా అలాంటి వారికి దూరంగా ఉండాలని వంగవీటి రాధా అన్నారు.

vangaveeti radha shocking comments goes viral

సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పారు. రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కొడాలినాని, వల్లభనేని వంశీ అక్కడే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ ఆరోపణలు ఎవ్వరి మీద చేశారో మరోసారి వంగవీటి రాధా మాట్లాడితే తప్ప తెలియని పరిస్థితులు ఉన్నాయి.

దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. దీనిపై ప్రభుత్వంలో ఉన్న కొడాలినాని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. రాధాకు పోలీసు సెక్యూరిటీని పెంచుతారా లేదా అనే అంశాన్ని వేచి చూడాలి మరి. ప్రస్తుతం రాధ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారన్నే రేపుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *