పాము ఆడించాలని అనుకున్నాడు… తీరా చూస్తే…!

ఇప్పటి వరకు మనం చాలా వైరల్ వీడియోలను చూశాము. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. కొంచెం విభిన్నంగా ఉంటే చాలా మంది లైక్ చేస్తారు. షేర్ చేస్తారు. మనం చూసే వీడియోల్లో కొన్ని క్రైం కూడా ఉంటాయి. మరి కొన్ని వాటిల్లో మనిషి ప్రాణాలకు ముప్పు ఉన్నాయి కూడా ఉంటాయి. అయితే ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

uttarakannada boy snake bite
uttarakannada boy snake bite

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా సిరసీ లో మాజ్‌ సయ్యద్‌ అనే యువకుడు నాగుపాములతో ఆడుకోవడం అలవాటు. అయితే రోజు లానే చేస్తూ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పాములంటే చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టపడే సయ్యద్ ఎన్నో ఏళ్ల నుంచి పాములను రక్షిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు సుమారుగా 5 వేలకు పైగా పాములను కాపాడి వాటని తిరిగి అడవి లో వదిలేశాడు.

ఇదే క్రమంలో కొద్ది రోజుల కింద ఇంతకు ముందు చేసినట్లుగానే మూడు నాగుపాములను దేవికెరె అనే అటవీ ప్రాంతంలో వదిలేందుకు వెళ్లాడు. అంత వరకు భాగానే ఉన్నా… అంతటితో ఆగకుండా వాటితో ఆడడం మొదలు పెట్టాడు. నిపుణుల మాదిరిగా ఆడించేందుకు సాహసించాడు. చాలా ప్రయత్నం చేశాడు. అంత వరకు బాగానే ఉన్నా.. కానీ అప్పుడే అందులో ఉండే ఓ పాము అకస్మాత్తుగా అతడిని కాటు వేసింది. దీంతో ఆస్పత్రిపాలైన సయ్యద్‌ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకున్నాడు అని అది చూసిన వారు అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *