నాజూకైన నడుము కోసం ప్రయత్నిస్తున్నారా.?
నాజూకైన సన్నని నడుమును పొందాలనకోవాలనుకున్న కళ ప్రతి స్త్రీకి ఉంటుంది. అయితే ఇది అంత సులువు కావు..అందరికీ వచ్చేది కాదు. నేడు మన జీవన శైలి..తీసుకునే ఆహారం పొట్ట, శరీర భాగాన్ని పెంచేలా చేస్తున్నాయి. కొందరు దీని బారీనుండి తప్పించుకునేందుకు డైటింగ్ చేస్తుంటారు. ఎన్ని డైట్ లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా..వ్యాయామం ద్వారా మాత్రమే నాజూకైన నడుమును పొందడం సహాయపడుతుంది. శ్రద్ధగా తీసుకునే ఆహారం తీసుకోవడం వల్ల కూడా దీన్ని సాకారం చేసుకోవచ్చు. సన్నని నడుము పొందడానికి సమతుల్య అల్ఫాహారంతో రోజును ప్రారంభించాలి. మంచి అల్ఫాహారం వేగమైన జీవక్రియను ప్రారంభిస్తుంది. తృణధాన్యాలు మరియు హోల్ వీట్ బ్రెడ్, ప్రొటీన్ అధికంగా ఉండే గుడ్లు, అధిక విటమిన్లు ఉండే పండ్లు కలిపి తీసుకోవాలి.
సమయం ఉంటే సౌకర్యవంతమైన, ఇంకా ఆరోగ్య కరమైన అల్ఫాహారం కోసం ఫ్రూట్ స్మూతీ మరియు పోషకాలు నిండి ఉండే ఒక సిరల్ బార్ తీసుకోవడం కూడా చాలా మంచింది. అల్ఫాహారం తీసుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లు కూడా తాగితే మంచిది. ఎందుకంటే ఇది దాహాన్ని ఆకలిగా పొరబడటాన్ని కూడా నిరోధిస్తుంది. నీరు హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయ పడుతుంది. డైట్ అనుసరించే వాళ్లు కొవ్వులను పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని నమ్ముతారు. కానీ సమతుల్య ఆహారం కోసం ఆరోగ్య కరమైన కొవ్వులు తినడం కూడా అవసరం మరియు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
మోనా అన్సాచురేటెడ్ కొవ్వులను అధిక నిష్పత్తిలో కలిగిన ఆహారం నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించగలదు. బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు ఆకలితో ఉండకపోవడానికి ప్రయత్నించకపోవడమే మంచిది.. సాధ్యమైనంతగా చిత్తశుద్ధితో వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వారానికి 150 లేదా 75 నిమిషాల కఠినమైన కార్డియో వర్క్ అవుట్ అనుసరించాలి. నేలపై లేదా చాప మీద పడుకుని పాదాలను నేలమీద ఉంచి మోకాళ్లను వంచండి. చేతులు ఛాతీపై అడ్డంగా పెట్టి పైకి కిందకు గుంజిళ్లు తియ్యాలి. ఇలా మూడు సెట్లు తీస్తే ప్రతి సెట్లో 10-20 సిట్ అప్ లు ఉండేలా చూసుకోవాలి.