హాలీవుడ్ రేంజ్‌లో బాలీవుడ్‌ మూవీ ట్రైలర్‌.. ఎఫెక్ట్స్‌ అదిరిపోయాయ్..!

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ పెళ్లయిన తర్వాత తొలిసారి జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు మూవీపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

Trailer out From Brhmastra Movie

తెలుగులో ఈ సినిమా తొలి భాగానికి శివ అని నామకరణం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.
‘‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది..” అంటూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ అద్భుతంగా సాగింది. ఓ వైపు యువ జంట ప్రేమను చూపిస్తూనే, బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ, నంది అస్త్రం (నాగార్జున) దుష్టశక్తులతో చేసే పోరాట సన్నివేశాలు హాలీవుడ్‌ని తలపించేలా ఉన్నాయి. ‘‘ఇషా నాకేమీ కాదు. అగ్నితో నాకు బంధం ఉంది. అగ్ని నన్ను దహించలేదు’’ అంటూ శివ చెప్పే డైలాగ్‌లు, ఇషా-శివల ప్రేమాయణం మెప్పించేలా సాగాయి.

దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *