ఇవి తిన్నారంటే ఎలాంటి వైరస్ లైన మాయం.. అవేంటో వెంటనే తెలుసుకోండి!

మన శరీరానికి విటమిన్లతో పాటుగా, మినరల్స్ కూడా అంతే అవసరం. అంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటివి మనం తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది ఖనిజం జింక్. ఈ జింక్ వ్యాధి నిరోధక వ్యవస్థ వివిధ అలర్జీలు అలాగే వ్యాధులు వైరస్ ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. కోవిడ్ సమయాలలో అందరి దృష్టి ఎక్కువగా ఇమ్యూనిటీ పై పడింది. విటమిన్ సి,డి లతో పాటు జింక్ ఖనిజం కూడా ఇమ్యూనిటీ కి తోడ్పడుతుంది. మానవ శరీరంలో అనేక జీవక్రియల తో పాటుగా జింక్ సంబంధం కలిగి ఉంటుంది. ఇది భిన్న కణసంబంధ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, ప్రోటీన్ సంశ్లేషణ, అలాగే గాయాలు నయం చేయడానికి, డీఎన్ఏ సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తుంది.

అదేవిధంగా సాధారణంగా సంభవించే జలుబు, హైపో థైరాయిడ్ నివారణ కు, జీర్ణవ్యవస్థకు, అదేవిధంగా హృదయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ, రుచి వాసన పసిగట్టడానికి ఇది చాలా అవసరం. అంటువ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అని పరిశోధనల్లో తేలింది. ఇక జింక్ తగిన మోతాదులో తీసుకోకపోతే, శరీరం దానంతట అదే జింక్ ను ఉత్పత్తి చేసుకోలేదు, నిల్వ కూడా చేసుకోలేదు. కేవలం ఆహారం ద్వారానే శరీరానికి అందుతుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏడాదిలో సుమారు 8 లక్షల మంది జింక్ కొరతతో మరణిస్తున్నారు అని తేలింది.

అందులో సగానికి ఐదేళ్లలోపు పిల్లలు ఉండడం గమనార్హం. ఈ జింక్ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి, క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జింక్ ను పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.. మాంసాహారం, అలాగే మొక్క సంబంధిత ఆహారంలో సాధారణ స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. పప్పు దినుసులు, కాయధాన్యాలు, బ్రెడ్ వాటిలో కూడా జింక్ పుష్కలంగా లభిస్తుంది. మొలకెత్తిన గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. కొందరు జింక్ ను పొందడానికి టాబ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటివల్ల ఉపయోగాల గురించి పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్ లు ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులు జింక్ ఉండే ఆహారం తినడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *