నేడే మార్గశిర ఏకాదశి..ఈ చిన్న పని చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే!
హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే మార్గశిర మాసం శుక్ల ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని జరుపుకోవటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అందుకే మార్గశిర ఏకాదశి నాడే మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు అని పండితులు చెబుతున్నారు. మనం చేసిన పాపం నేడు ఈ వ్రతం ఆచరించడం వల్ల తొలగిపోయి మోక్షం లభిస్తుంది కనుక ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు.
ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఉపవాసంతో పూజ చేయడం వల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటాయి. మరి ఈ వ్రతం విధంగా ఆచరించాలి అనే విషయానికి వస్తే.. తెల్లవారుజామున నిద్రలేచిన అనంతరం స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత విష్ణుమూర్తి విగ్రహానికి లేదా చిత్రపటానికి పంచామృతాలతో అభిషేకం చేసి అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి.ఈ వ్రతం ఆచరించేవారు కఠిన ఉపవాసాలతో ఉంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఇక పూజ అనంతరం సాయంత్రం మన ఆర్థిక స్తోమతను బట్టి పలువురికి దానధర్మాలు చేయడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది. ఈ వ్రతమాచరించే వారు నేడు ఉపవాసం చేస్తూ ఎలాంటి పప్పు ధాన్యాలు, బియ్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండి ఆచరించాలి.సాయంత్రం పూజ అనంతరం స్వామివారి సహస్ర నామాలను చదువుతూ జాగరణ చేసే మరుసటిరోజు ఉదయం తిరిగి పూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఇలా మార్గశిర శుక్ల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మోక్షం కలుగుతుంది.