వర్షా కాలంలో ఈ జాగ్రతలు పాటించకపోతే … ఆ వ్యాధులకు వెల్ కమ్ చెప్పినట్లే !

వేసవి తాపం వర్షాకాలం చూపిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి లేకపోతే వర్షాకాలంలో రోగాల బారిన పడినట్టే. మారుతున్న జీవనశైలిలో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు సైతం రోగాలు బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన సమస్య ఏమిటంటే రోగ నిరోధక శక్తి అతి తక్కువగా ఉండటం వలన వర్షాకాలంలో అతివేగంగా కొత్త వైరస్ లు బారిన పడుతున్నారు. వాన కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతలో కొంతైనా రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరి…

Tips to followed in rainy season to avoid seasonal health issues

వర్షాకాలంలో అధికంగా వేడి నీటిని తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే దగ్గు జలుబు అనేది అతి తీవ్రంగా వాన కాలంలో బాధిస్తుంటాయి. వేడి నీటిని సేవించడం వలన ఎటువంటి వైరస్ లు దరిచేరవు.అలానే ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు శుభ్రపరుచుకోవాలి వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా చేతులకు అధికంగా ఉంటుంది, దీనివలన త్వరగా ఇన్ఫెక్షన్ గురికావచ్చు. పచ్చివి లేదా ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని. మాంసకృత్తులను వర్షాకాలంలో అతి తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌కు వర్షాకాలంలో దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఎటువంటి విష జ్వరాలు మనలని దరిచేరవని తెలుపుతున్నారు. ఇది కేవలం వర్షాకాలంలో ఇటువంటివి విష జ్వరాలు రాకుండా ముందుగా అవగాహన కొరకు ఇస్తున్న సమాచారం. ఎటువంటి అనారోగ్యం సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *