తమలపాకులో ఇమిడి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసా?

Betel Leaf: తమలపాకు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఇది సంస్కృతం లో నాగవల్లి అని పిలవబడుతుంది. ఇది ఎగబ్రాకే తత్వాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పూజల్లో ఈ తమలపాకు ప్రత్యేకం. అటువంటి ఈ తమలపాకులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Betel Leaf
Betel Leaf

తమలపాకు రసం ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ముఖం పైన ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలను తగ్గించి ముఖం మరింత యవ్వనంగా కనిపించేలా సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు తమలపాకు పది గ్రాముల మిరియాలు కలిపి తింటే బరువు తగ్గే విషయంలో కొంత వరకు మెరుగుపడుతుంది. తమలపాకు ను పెస్ట్ ల చేసి మోకాళ్ళ పై రాయడం మోకాళ్ల నొప్పి తగ్గే అవకాశం ఉంది.

మన శరీర అవయవాలు వాపులు నొప్పులు కలిగినప్పుడు తమలపాకును వేడిచేసి కడితే మంచి ఫలితం దక్కుతుంది. ఇక చుండ్రుతో బాధపడేవారు. తమలపాకుల పేస్ట్ తయారు చేసుకుని. తలకు పట్టించి రెండు గంటల తర్వాత తల స్నానం చేయడం ద్వారా చుండ్రు నుంచి విముక్తి కలుగుతుంది.

చిన్నపిల్లల్లో ఎక్కువగా జలుబు ఉంటుంది. అలాంటప్పుడు తమలపాకును వేడిచేసి ఆముదంతో కలిపి చాతి మీద ఉంచడం ద్వారా జలుబు మాయం అవుతుంది. అంతేకాకుండా తమలపాకు రసంలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు కూడా తమలపాకును పరగడుపున నమిలి మింగడం మంచిది. కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ప్రయత్నించండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *