ఇలా చేస్తే ఎక్కువ రోజులు యంగ్ గా కనిపిస్తారు…!

అరే ముఖంపై ముడతలు పడుతున్నాయి ఏం చేద్దాం అని దిగులు పడేవారు కొందరైతే..అదే ఆలోచనతో ఉంటూ దిగాలు చెందే వారు మరి కొందరు. అందానికి అందరూ ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. వయసు భారం పడినా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ధనవంతులైతే సర్జరీలు చేసుకుని అందంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో వయసుకు, అందానికి సంబంధం లేకుండా ఉంటున్నారు చాలా మంది. ఎందుకంటే వారు పాటించే ఆహారపు అలవాట్లుగానీ, తీసుకునే జాగ్రత్తలుగానీ ఆ విధంగా ఉంచుతాయి.

అయితే తక్కువ ఖర్చుతో ఉన్నదాంతో సరిపెట్టుకుని వయసును బయటకు కనబడకుండా ఉంచేందుకు కొన్ని చిట్కాలు మీకోసం..ఒంట్లో వేడి ఎక్కువ అయితే చర్మం ఉండే తీరు వేరుగా ఉంటుంది. అందువల్ల సబ్జా గింజలను నానబెట్టుని రోజూ తినాలి. ఇవి శరీరంలో  వేడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్ లు చర్మాన్ని, మెదడును, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి చర్మాన్ని యూత్ ఫుల్ గా కనిపించేలా చేస్తుంది.  దాల్చిన చెక్కపొడి చర్మసౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రతి రోజూ ఈ దాల్చిన చెక్క పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. పాలు, నీలు వంటి వాటిల్లో కలుపుని తాగవచ్చు. ఇది చర్మాన్ని నిగారిస్తుంది. అంతేకాదు మెదడు చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది. కొబ్బరి నూనె కూడా మేలు చేకూరుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. దాంతో శరీర బరువు అదుపును చేస్తోంది. కొబ్బరి నూనె తీసుకోవడంలో శరీరంలోని కణాలు బలంగా మారతాయి. కణాలు బలంగా ఉంటే బాగా యంగ్ గా కనిపిస్తాము.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *