ఇదేమి రెడ్ల రాజ్యం కాదు..! : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని,డి జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కాళ్లు పట్టుకుంటే జగన్ మంత్రి పదవులు ఇవ్వరని అన్నారు. రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని తాను అనుకోలేదని వెల్లడిండిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవకాశం ఉన్నప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న స్వామి భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన మంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జగన్ ఫొటోను చేతిలో పట్టుకుని ఆయన తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. అందుకే జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించానని తెలిపారు. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని, పార్టీ కోసం కష్టించి పని చేసే వారికే పదవులు ఇస్తారని చెప్పారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అనేది రెడ్ల రాజ్యం కాదని, ఇది బడుగుల రాజ్యమని అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి… తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని చెప్పారని తెలిపారు. తనకు ప్రాధాన్యం లేకుంటే తప్పు చేసిన ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేయగలిగేవాడినా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తున్న ప్రతిసారి బాధపడుతూనే ఉంటానని, ఎక్సైజ్ సిబ్బంది ప్రలోభాలకు గురి కావద్దన్నారు. ఉద్యోగాల నుండి సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.