అన్నం తిన్న తర్వాత చేయకూడనవి..!

తిన్న వెంటనే తెలియక కొందరు చేయకూడని పనుల చేస్తారు. కానీ అలా చేస్తే అనారోర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తిన్న తర్వాత కూడా కొన్ని సూత్రాలు పాటించాలని చెప్తున్నారు. వైద్యులు. అవేంటంటే… భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది. అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. కనీసం గంట గ్యాప్ ఉండాలి. అలా కాకుండా తాగితే  టీ ఆకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసపుకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది.

తిన్నాక స్నానం చేసే అలలవాటు ఉంటుంది కొందరికి. ఇలా చేయడం వల్ల కాళ్లూ, చేతల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరును తగ్గించే అవకాశం ఉంటుంది.  కొందరైతే ఏకంగా అన్నం తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు. అలా పడుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవ్వక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. తిన్న తర్వాత కనీసం రెండు గంటలైనా వేచి ఉండాలని.. అప్పుడే నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తిన్న తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే మంచిదని చెప్తుంటారు. కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలం అవుతుంది.  తిన్న వెంటనే కాకుండా, ఓపది నిమిషాల తర్వాత నడిస్తే మంచిది.  తిన్నాక ఈత కొట్టడం చాలా ప్రమాదకరమని కూడా చెప్తున్నారు. తిన్న వెంటనే ఈత కొడితే కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువ.   అయితే ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఇవే సమస్యలు తలెత్తుతాయని లేదు..తలెత్తవని లేదూ.. ఆరోగ్య స్థితి, శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. వైద్యులను సంప్రదించి పాటిస్తే మంచిది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *