వాళ్లే తగలబెట్టి వేరే వాళ్లపై నెడుతున్నారు : చంద్రబాబు

కోనసీమను వైసీపీ మనుషులే తగులపెట్టారని, అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడుకు ర్యాలీగా వెళ్తూ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగనుకు అలవాటుగా మారుంది. ప్రభుత్వాన్ని జగన్ నడపలేరు. మధ్యంతరానికి జగన్ సిద్దపడుతున్నారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. టీడీపీ కార్యకర్తలెవరూ భయపడరు. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా.

ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా..? మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా..? జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి. మహానాడుకు నడిచైనా.. ఎడ్లబళ్లల్లోనైనా రండి. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదం. ఆ వర్గమైనా బాగున్నారా..? ఏ ఒక్క వర్గం బాగుందన్నా.. తిరిగి అమరావతికి వెళ్లిపోతా. వైసీపీలో ఎక్కడుంది సామాజిక న్యాయం. ఉత్తరాంధ్రకు, రాయలసీమపై ప్రేమ లేదు.. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించ లేదు.

విశాఖ మీద ప్రేముంది.. రాజధాని తీసుకెళ్తానన్నవాడు.. రాజ్య సభ స్థానాలు ఎందుకు కేటాయించ లేదు. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని బస్ యాత్ర చేపడతారు. ఎస్సీలకు చెందిన 28 స్కీములు రద్దు చేశారు. డబ్బులున్న వాడికి ఊడిగం.. పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. దావోస్ కు వెళ్లి అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు కొనసాగించరా..? వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *