దొంగకు చుక్కలు చూపించిన ముసలావిడ.. అసలు ఏం జరిగిందంటే?

Old women And Thief: ఈ మధ్యకాలంలో వయసు దాటిన వాళ్ళు కూడా అనేక సాహసాలు చేస్తూ వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యం గా సోషల్ మీడియా ప్రభావం కారణంగా కొందరు ముసలి వ్యక్తులు తనదైన స్టైల్ లో సాహసాలు చేసి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. మరి ఇదే నేపథ్యం లో బ్రిటిష్ కొలంబియా లో ఒక బామ్మ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Old women And Thief
Old women And Thief

అసలు ఏం జరిగిందంటే.. కొలంబియా లోని ఒక సూపర్ మార్కెట్ లోకి ఒక నార్మల్ కస్టమర్ వచ్చాడు. ఆ సూపర్ మార్కెట్ కి సైకిల్ మీద వచ్చిన అతను తన వెంట ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడు. షాపింగ్ కార్టు తీసుకొని అతనికి కావలసిన సామాన్లు అన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. ఇక బిల్ పే చేయకుండా తప్పించుకోవాలని ప్లాన్ వేశాడు.

మంకీ క్యాప్ పెట్టుకొని మెల్లగా ఆ సూపర్ మార్కెట్ నుంచి జారుకోవలనుకున్నాడు. షాప్ లో ఉండే స్టాప్ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు. అదే సమయంలో 73 సంవత్సరాల బామ్మ తన కార్టు తో ఆ వ్యక్తిని అడ్డుకొని ఆ మంకీ కాప్ ను లాగేసింది.

ఇక లాభం లేదని వ్యక్తి ఆ కార్టు ను అక్కడే వదిలేసి అతని బ్యాగ్ తీసుకుని సైకిల్ మీద తిరిగి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో బాగా హడావిడి చేస్తుంది. మరి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు మీరూ ఓ లుక్కేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *