చైతు, సమంతల విడాకులతో ఆ డైరెక్టర్ కొత్త కష్టాలు!
Samantha And Chaitanya: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్యూట్ కపుల్ గా అందరి మనసులు ఫిదా చేశారు చై, సామ్. సినీ తారలు సైతం జలస్ గా ఫీల్ అయ్యేలా ముచ్చటగా తిరిగే వారు ఈ జంట. మరి వీరిద్దరి మధ్య ఏం మనస్పర్థలు వచ్చాయో గాని గతేడాది వీరి బంధానికి బ్రేక్ ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా గ్రామ్ లో అధికారికంగా తెలిపారు.
వీరిరువురు బంధం బ్రేక్ అవడాన్ని వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఈ బ్రేక్ అప్ ను త్వరగా రిసీవ్ చేసుకోలేకపోయింది. అందుకనే సమంత, నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. సమంత డివోర్స్ కు సరైన కారణం తెలియక పోవడం వల్లే ఇదింకా అలానే హాట్ టాపిక్ గా మిగిలిపోయింది.
ఇటీవల నాగ చైతన్య వారిద్దరి మధ్య మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ విడాకులు వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయమైనా.. వీరి బ్రేక్ అప్ తో ఒక ప్రముఖ డైరెక్టర్ నష్టపోయినట్లు తెలుస్తుంది. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? ఓ బేబీ సినిమాతో సామ్ కు మంచి సక్సెస్ ని ఇచ్చిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి.
చైతు, సామ్ విడాకులు జరగక ముందు, వీరిద్దరితో ఒక మూవీ తెరకెక్కించాలని నందినీరెడ్డి అనుకున్నారట. కథ కూడా అనుకున్నట్లు సమాచారం తెలిసింది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ అక్కడే ఆమెకు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న నందినీ రెడ్డికి చైతూ, సామ్ విడాకులు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.