ఆ హీరో నన్ను రోజంతా గడపమన్నాడు: నటి ప్రగతి

Actress Pragati: సినీ ప్రియులకు యాక్టర్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు హీరోల తల్లి పాత్రకు గాను ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Actress Pragati
Actress Pragati

ఇక ప్రగతి సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఇదే క్రమంలో ఆ మధ్య ‘ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావ’ పాటకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో స్టెప్పులు వేసి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్రగతి ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ తాను సినీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపింది. అప్పట్లో దర్శక నిర్మాతలతో పాటు ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

ఇక ఆ హీరో ఎవరు అన్న విషయం మాత్రం బయట పడలేదు. ఇదే క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులకు ఇదే సమస్య ఎదురైంది అని ప్రగతి తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రగతి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి చేస్తోంది. ఏదైనా ప్రగతి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *