రైల్వే పట్టాలపై కంకర రాళ్లు వేయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా మనం రైలు పట్టాలను పరిశీలించినప్పుడు రైలు పట్టాల కింద ఇరువైపులా కంకర రాళ్ళు ఉంటాయి. అసలు అలా రైలు పట్టాలపై కంకర వేయడానికి గల కారణం ఏమిటి? ఎప్పుడైనా మీకు ఇలా రైలు పట్టాలపై కంకర వేయడానికి కారణం ఏమిటి అనే సందేహం వచ్చిందా? మరి రైలు పట్టాలపై మాత్రమే అలా కంకర రాళ్లు వేయడానికి గల కారణం ఏమిటి?కంకర రాళ్లు కాకుండా మిగిలిన రాళ్లు ఎందుకు వేయరు? కంకర రాళ్ల కు రైలు ప్రయాణానికి ఉన్న సంబంధం ఏమిటి? అన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మనం గమనించినట్లైతే రైలు మార్గం భూమికి సమాంతరంగా కాకుండా రెండు మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది. ముందుగా రెండు మూడు పొరలతో మట్టి నింపి ఆ తరువాత కంకర సమాంతరంగా వేస్తూ ఆపై ఇనుప కడ్డీలతో రైలు పట్టాలను నిర్మిస్తారు. ఇలా రైలు మార్గాన్ని నిర్మించడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం. మట్టి పొరలపై కంకర రాళ్లు వేయడాన్ని బ్లాస్ట్ అంటారు. అలాగే కంకర పై ఉన్న ఇనుపకడ్డీలను స్లీపర్స్ అంటారు.ఇలా భూమి కన్నా కొంచెం ఎత్తులో రైల్వే మార్గం నిర్మించడానికి గల కారణం ఆ మార్గం గుండా రైలు ప్రయాణిస్తున్న సమయంలో రైలు బరువును ఈ బ్లాస్ట్, స్లీపర్స్ నియంత్రిస్తాయి.అందుకే రైలు మార్గాన్ని కొద్దిగా ఎత్తులో నిర్మిస్తారు.

ఇక రైలు పట్టాలపై కదులుతున్నప్పుడు మనకు ఒక రకమైన వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ కారణంగా రైలు పట్టాలు వ్యాప్తి చెందడానికి కారణం అవుతాయి. అందుకోసమే రైలు పట్టాల కింద కంకర రాళ్లను వేయడం వల్ల వ్యాప్తి చెందకుండా కాపాడుతుంది. దీంతో ప్రమాదాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కంకర రాళ్లకు బదులుగా సాధారణ రాళ్లను వేయడం వల్ల రైలు పట్టాలు వ్యాపించడానికి దోహదపడతాయి కనుక సాధారణ కంకర రాళ్ళను రైలు పట్టాలపై ఉపయోగిస్తుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *