AP Strike: పీఆర్సీపై చర్చలు సఫలం.. ఎట్టకేలకు ఆందోళనలకు తాత్కాలిక బ్రేక్​

AP Strike: గత కొద్దిరోజులుగా ఏపీ ఉద్యోగులు పీఆర్సీపై చేస్తున్న నిరసనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సమస్యపై ఉద్యోగ సంఘాలతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్​ రెడ్డి, సీఎస్​ సమీర్​ శర్మ చర్చలు జరపగా.. సఫరీకృతమయ్యాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల డిమాండ్లన్నీ పరిశీలిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా ఆందోళన విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, వచ్చే బుధవారం మరోసారి సీఎస్​తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

temporary-break-for-ap-employees-strike

మరోవైపు సచివాలయ ఉద్యోగల అంశాలు, ప్రభుత్వ ఉద్యోగుల అంశాలు కూడా పరిశీలిస్తామని మంత్రి బుగ్గన హామీ ఇచ్చినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి మీడియాతో అన్నారు. గ్రామ సచివాలయ ఉగ్యోగుల ప్రొహిబిషన్​ కాలం పూర్తికావస్తున్నందున వారిని రెగ్యులర్ చేయాలని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని చెప్పారు. వీటితో పాటు వీఏవో, వీఆర్ఓలకు పదోన్నతి కల్పించాలని, వారికి కూడా రెగ్యులర్ స్కేల్ ఇవ్వమని కోరగా.. అందుకూ మంత్రి ఓకే అన్నట్లు సమాచారం.

వీటితో పాటు అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు.. జిల్లాలో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని.. మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్రామి రెడ్డి వివరించారు.

ఈ విషయంపై స్పందించిన మంత్రి బుగ్గన.. చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరిస్తున్నామని.. కొవిడ్​ సహా వివిధ అంశాల వల్ల ఈ సమస్యపై పరిష్కారం కాస్త ఆలస్యం అవుతూ వచ్చిందని అన్నారు. ప్రభుత్వం అందర్నీ తమ కుటుంబంలాగే చూస్తుందని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *