మా ప్రభుత్వంలో నేరాలు పెరుగుతున్నాయి : ఎంపీ రఘురామరాజు

రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో 3 హత్యలు, 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాలు గురించి తమ పార్టీ నేతలు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిదని పేర్కొన్నారు. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉందన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మహిళలపై భౌతిక దాడుల ఘటనల్లో మొదటి స్థానంలో ఉందని వివరించారు.

2019తో పోలిస్తే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతం నమోదు అయిందని తెలిపారు. ప్రతి 3 గంటలకు ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. 2021లో అత్యధిక లాకప్ డెత్ లు ఏపీలోనే జరిగాయని, అదృష్టం బాగుండి తాను బయటపడ్డానన్నారు. ప్రభుత్వం సిన్సియర్ గా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఒంగోలులో హోంమంత్రిని అడ్డుకున్నందుకు ఇద్దరు మహిళలను రాత్రంగా స్టేషన్లో ఉంచడానికి బుద్ధిలేదా అని మండిపడ్డారు.

దేశంలో ఇలాంటి ఘటన ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం..అసలు ప్రభుత్వమే కాదని, మద్య నిషేధంలో భాగంగా మా ప్రభుత్వం పర్మిట్ రూమ్ లు తీసేసిందని ఆరోపించారు. 2, 3 రోజుల్లో చెదురుమదురుగా జీతాలు పడొచ్చని ఆర్థికశాఖ అంటోందని జోక్ వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చినా రాష్ట్ర అప్పులు తీరవు అని,  175 అంటున్నాం.. చివరన 5 తీస్తే మనకు చాలా కష్టమన్నారు. తమ పార్టీకి 175 సీట్లు రావాలంటే ప్రక్షాళన జరగాలని సూచించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *