ఈ షో కోసమే శ్రీముఖి కామెడీ స్టార్స్ ను వదులుకుందా!

Sreemukhi: బుల్లితెర ప్రేక్షకులకు శ్రీముఖి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టెలివిజన్ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. సుమ, ఝాన్సీ, ఉదయ భాను వంటి యాంకర్లు ఉన్నపటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటు బుల్లితెర పైనే కాకుండా అటు వెండితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.

ఇక ఈ స్మైలింగ్ బ్యూటీ మాటలకి కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. పటాస్ షో తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న శ్రీముఖి.. క్రమంగా బిగ్ బాస్ షో తర్వాత ఈ అమ్మడి ఫాలోయింగ్ తగ్గిపోయింది. అయినప్పటికీ స్టార్ట్ మ్యూజిక్ అనే షో లో సోలో యాంకర్ గా కొన్ని రోజులు బుల్లితెర ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

ఆ తర్వాత పలు షో లలో చేసి మిడిల్ లోనె లెఫ్ట్ అయ్యేది ఈ భామ. ఇటీవలే కామెడీ స్టార్స్ షో లో బాగానే హడావిడి చేసింది. ఆ షోలో క్లిక్ అయింది అని అనుకునే లోపు శ్రీముఖి ఆ షోకు గుడ్ బై చెప్పకనే.. చెప్పింది. ఇంతకు ముందు ఆ షోలో యాంకర్ వర్షిని ఉండేది. ఆమెను లెఫ్ట్ చేసి శ్రీముఖి ని సెట్ చేశారు. ఇప్పుడు శ్రీముఖి స్థానాన్ని టిక్ టాక్ ఫేమ్ దీపికా పిల్లి కొట్టేసింది.

ఇక షో నుంచి శ్రీముఖి తప్పుకుందా.. లేక తప్పించారా అనే విషయం పై పూర్తి అవగాహన లేదు. కానీ శ్రీముఖి ఆ షో నుంచి బయటకు వచ్చి జీ తెలుగుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న షో లో శ్రీముఖి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కామెడీ స్టార్స్ షోని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *