రష్మీని ఫిలింనగర్ గేటుకు కట్టేస్తానని బెదిరించా: నిర్మాత

యాంకర్‌ రష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.మొదట సినిమాల్లో సహానటి పాత్రలతో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రష్మీ.. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతోంది.  తనదైన మాటలతో యాంకరింగ్‌తో కట్టిపడేసే రష్మీ .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రష్మీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ చిన్నది.

senior producer balaji nagalingam shocking commnets on anchor rashmi

అయితే ఓ సినిమా విషయంలో రష్మీ తనని ఇబ్బంది పెట్టిందని టాలీవుడ్ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాణి గారి బంగ్లా మూవీ సమయంలో రష్మీని తాను బెదిరించినట్లుగా వెల్లడించారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ పాట డబ్బింగ్‌కు వచ్చేసరికి తాను చేయనంటూ ఇబ్బంది పెట్టింది. అంతేకాదు హీరోని మార్చాలంటూ డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై తనని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగా చాలా దురుసుగా వ్యవహరించింది. అ క్రమంలో ‘నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు’ అంటూ నన్ను బెదిరించింది’’ అని చెప్పుకొచ్చాడు.

senior producer balaji nagalingam shocking commnets on anchor rashmi

మూవీ మధ్యలో వదిలిస్తే తనపై న్యాయపరమైన చర్యలు దిగుతానని, అలాగే ఫిల్మ్ ఛాంబ‌ర్ గేటుకు క‌ట్టేసి కొడ‌తాన‌ని బెదిరించడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్‌ పూర్తి చేసిందని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ‘నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత.. ఇలా మాట్లాడొచ్చా’ అని మండిపడ్డాడు. రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పాడు. న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని, ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. అయితే రష్మీ మంచి ఆర్టిస్ట్ అని, సినిమా చేస్తున్నంత సేపు తను సెకండ్ టెక్ తీసుకోలేదంటూ చివరగా ప్రశంసించాడు నాగలింగం .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *