మరో స్టార్ హీరోతో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న సమంత!

Samantha: సినీ ప్రేక్షకులకు సమంత పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ.. ఆ పై పలు స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సమంత అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో ఎంతమంది ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఇటీవల వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సమంత పాన్ ఇండియా స్థాయిలో కూడా పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సమంత కు కోలీవుడ్ లో మరో స్టార్ హీరో సరసన అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమాలో సమంత ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీని గురించి సమంతతో కూడా చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సెల్వ కుమార్, హీరో కార్తీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో చేస్తున్న విషయం గురించి సమంత అధికారకంగా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. పోగా సామ్ ఈ ఏడాది యశోద, శాకుంతలం అనే రెండు వరుస సినిమాలతో థియేటర్లలో హడావిడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *