తనకి కూడా ఫీలింగ్స్‌ ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో, తన ట్వీట్స్ తో, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దేని గురించి అయినా తనకి ఇష్టమొచ్చింది మాట్లాడేస్తాడు ఆర్జీవీ. అలాంటి ఆర్జీవీ ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. నాకు అందరిలాగా ఎమోషన్లు, ఫీలింగ్స్ లేవు. నేను ఎవరికీ అటాచ్ అవ్వను అంటూ ఉంటారు. ప్రేమ, బాధ, కోపం ఇలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని బంధాలకి దూరంగా ఉంటానని చెప్తూనే ఉంటాడు ఆర్జీవీ. అటువంటి రామ్ గోపాల్ వర్మ మారిపోయారా? ఈరోజు ఆయన చేసిన ట్వీట్ చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది.

Rgv intresting comments on feelings

పెట్ డాగ్ ను ప్రేమతో తన ఒడిలో కూర్చొబెట్టుకున్న ఫొటోను ఆర్జీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నాకు ఫీలింగ్స్‌ ఉన్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో తనకు పిల్లలు, ఫ్యామిలీ, పెళ్లి, ఇతర జీవరాశులపై ఎలాంటి ప్రేమ, మక్కువ లేదని చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ పెట్టడం పట్ల అందరూ ఆలోచనలో పడ్డారు. ఆర్జీవీ ఎవరి అంచనాలకు దొరకడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ‘మీరు మారిపోయారు సార్’ అంటున్నారు.

ఇక సినీ రంగంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఆర్జీవీ గొప్పతనం, ఉన్నత ఆలోచనా విధానం అందరినీ ఆకర్షితులను చేస్తాయి. ఆయన జీవన విధానం, వే ఆఫ్ థింకింగ్ ప్రతి ఒక్కరికీ కొంత మేర స్ఫూర్తిదాయంగా ఉంటుంది. ఆయన యాటిట్యూడ్‌కి, వే ఆఫ్‌ థింకింగ్‌కి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే ఆయన చెప్పేవన్నీ నిజాలే అయినా.. చేయడం కష్టమంటూ కొందరు అభిప్రాయపడుతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *