తన గురించి డైరీలో అలా మెన్షన్ చేసిన రష్మిక మందన!

Rashmika Mandanna: రష్మిక మందన్న పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘ఛలో ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ. మొదటి చూపులోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ పై పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినీ లోకమంతా ఏలుతూ ఇండియన్ క్రష్ గా మారింది ఈ ముద్దు గుమ్మ.

ఇక ఇటీవలే వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మిక తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్థాయిలో కుర్ర కారును ఓ ఊపు ఊపింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో రష్మిక తాను చేసిన పనుల గురించి తన ఇన్ ఖాతా ద్వారా డైరీ రూపంలో అప్ డేట్ ఇచ్చింది.

జనవరి 28న రష్మిక చేసిన పనులను డైరీ రూపంలో రాసింది. డియర్ డైరీ అంటూ.. మొదలు పెట్టి ఇది రాయక చాలా రోజులు అవుతుంది.. నిద్ర లేచాను.. కానీ ఏదోలా అనిపించింది.. సో మళ్లీ పడుకున్నాను. నా శరీరానికి రెస్ట్ ఇవ్వాలని పడుకొని మళ్ళీ లేచాను. ఉదయం పూట వర్కౌట్ చేయలేదు.

ఇక బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు. పనికి సంబంధించిన విషయం గురించి ఫోన్ లో మాట్లాడాను. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా గురించి అప్డేట్ ఇచ్చాము. ఆ తరువాత జిమ్ కి వెళ్లి లైట్ గా వర్క్ అవుట్ చేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ చేశాను. అంటూ తను రోజులో చేసిన పనులను గురించి డైరీ రూపంలో మెన్షన్ చేసింది రష్మిక.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *