రష్మిక ఆస్తుల విలువ తెలుసా..? అప్పుడే అన్ని కోట్లు సంపాదించిందా?

సౌత్‌ ఇండియాలో అగ్ర కథానాయికల్లో ఒకరైన రష్మిక మందాన.. అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. మోడల్‌‌గా తన కెరీర్ మొదలు పెట్టిన రష్మిక ఆ తర్వాత హీరోయిన్‌‌గా మారింది. 2016లో కన్నడలో వచ్చిన కిరిక్ పార్టి చిత్రంతో వెండితెరకి పరిచయమైంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సోయగం… గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో ఒక్కసారిగా తెలుగులో టాప్ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది. ఇటీవల విడుదలైన పుష్ప పాన్‌ ఇండియా సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఫామ్‌‌లో ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు టాప్ హీరోల సినిమాలున్నాయి.

rashmika mandanna assets and remunaration

ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్‌గానూ దూసుకుపోతుంది ఈ భామ. పైగా ఈమె గోల్డెన్ లెగ్ కూడా. రష్మిక నటించిన సినిమాలలో దాదాపు 80 శాతం విజయాలే ఉన్నాయి. తెలుగులో అయితే ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి విజయాలతో అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా ఇప్పుడు హిందీలోనూ నటిస్తుంది రష్మిక మందన్న. ఇక తెలుగు, హిందీ, తమిళంలో వరస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక.

అయితే ఒక్కో సినిమాకి రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. ఆమె ఆస్తి ఎన్ని కోట్లని నెటిజన్లు ఈ మధ్య తెగ సెర్చ్ చేస్తున్నారట. దీంతో వీటిపై ఇంట్రస్టింగ్‌ విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం హిందీలో ఈమె చేతిలో 2 సినిమాలు ఉండగా.. ఒక్కో సినిమాకు రష్మిక 4 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. మరోవైపు తెలుగులో కూడా ఒక్కో సినిమా కోసం 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. తమిళంలోనూ కోటిన్నరకు పైగా రష్మిక రేంజ్ ఉంది. ఈమెను కన్నడ ఇండస్ట్రీ తట్టుకోలేకపోతుంది. ఇక ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. మొత్తం ఏడాదికి ఆమె వేతనం సుమారుగా 5 కోట్లని తెలుస్తోంది. ఆమె ఆస్తి మొత్తం రూ. 37 కోట్లు ఉంటుందని సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *