తనపై వచ్చిన ఆ రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన రాశీఖన్నా.. తొలి చిత్రంలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే మంచి అవకాశాలను అందుకుంది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమపై తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, ఇక్కడ తన టాలెంట్‌కు దగ్గ రోల్స్‌ రాలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా వ్యాఖ్యలు చేశారని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Rashi Khanna clarifies recent comments she made on the south Indian film industry

దీంతో దక్షిణాది సినీ ప్రియులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. హీరోయిన్‌గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమను విమర్శిస్తావా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. బాలీవుడ్‌లో అవకాశాలు రాగానే.. సౌత్ ఇండస్ట్రీ చులకన అయిందా? అంటూ నిప్పులు చెరిగారు. ఇలా రాశీఖన్నాకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న నెగటివ్‌ ప్రచారంపై ఎట్టకేలకు ఆమె పెదవి విప్పారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.

https://twitter.com/RaashiiKhanna_/status/1511615813047914503?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1511615813047914503%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fraashii-khanna-clarification-about-south-films-issue-condemns-false-reports-on-badmouthing-south-films-28565

ఈ మేరకు బుధవారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘”సౌత్ సినిమాల గురించి నేను చెడుగా మాట్లాడినట్టు కల్పించి రాసిన కంటెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎవరు చేసినా… దయచేసి ఆపేయమని కోరుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా, భాషపై నాకు గౌరవం ఉంటుంది” అని రాశీ ఖన్నా ట్వీట్ చేశారు. ‘మద్రాస్‌ కేఫ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతోనే రాశీ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పరాజయం పొందడంతో ఆమె దక్షిణాది సినిమాల్లో నటించి విజయాలు అందుకుని గ్లామర్‌ డాల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె తిరిగి బాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ‘రుద్ర’ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా రాశీకి అక్కడ మంచి మార్కులు పడేలా చేసింది. ‘రుద్ర’ విజయం తర్వాత అక్కడి ఇంటర్వ్యూల్లో రాశీ.. సౌత్‌ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *